Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వికలాంగులకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

Author
Posted By Telangana Vaartha
| 02 Oct 2026, 05:29 PM |
వికలాంగులకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

రామన్నపేట 2 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని ఆర్టిసి బస్సుల్లో వికలాంగుల పాసులు అనుమతించాలని అక్టోబర్ 8న ఆర్టిసి బస్సు భవన్ ముందు ధర్నా పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ రామన్నపేట మండలం నిదాన పెళ్లి గ్రామంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్. పి.ఆర్.డి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 8న ఆర్టిసి బస్సు భవన్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పోస్టర్ను వారు ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టిసి బస్సులలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 34 నెలలు పూర్తి అవుతున్న హామిని అమలు చేయలేదని అన్నారు. ఇప్పటికే మహిళా వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులో ఉందని కేవలం పురుషులకు మాత్రమే అమలు చేయాల్సి ఉందని అన్నారు.జిల్లా స్థాయిలో డీలక్స్ బస్సుల్లో వికలాంగుల రాయితీ పాసులను అనుమతిస్తున్నారని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే ఎక్ష్ప్రెస్స్,డీలక్స్ బస్సుల్లో మాత్రం వికలాంగుల పాసులను అనుమతించడం లేదని అన్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్డినరీ బస్సుల తక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయని అలాంటప్పుడు వికలాంగులకు ఎలా ఉపయోగపడుతుందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల బస్సుల్లో వికలాంగుల పాసులు అనుమతించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు కోసం 34 నెలల నుండి వికలాంగులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఆర్టిసిలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని,గ్రేటర్ హైదరాబాద్పరిధిలో నడిచే అన్ని రకాల ఆర్టిసి బస్సుల్లో వికలాంగుల పాసులు అనుమతించాలని అక్టోబర్ 8న హైదరాబాద్ లోని బస్సు భవన్ ముందు జరిగే ధర్నాలో జిల్లా వ్యాప్తంగా వికలాంగుల పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిదాన పెళ్లి గ్రామ అధ్యక్షులు బొడ్డుపల్లి అంజయ్య గ్రామ ప్రధాన కార్యదర్శి భాష బోయిన యాదయ్య ఉపాధ్యక్షులు భాష బోయిన ప్రభుదాస్ చల్ల నాగార్జున వంగాల రాజు వీరమ్మల్లశీను వర్గాల స్వామి నారప్పక శ్యామసుందర్ ఆగుల. లచ్చమ్మ వి.జానమ్మ ఏ. లక్ష్మయ్య వి.పద్మ తదితరు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.