Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రజా భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి

Author
Posted By A.Timma Gurudu
| 02 Oct 2026, 05:18 PM |
ప్రజా భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి

ముఖ్యమైన పాయింట్స్:

  • గుడిదొడ్డిలో ఘనంగా గ్రామసభ నిర్వహణ

జోగులాంబ గద్వాల 2 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఐజ గ్రామ సభలతోనే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయని స్పష్టం చేస్తూ, ఐజ మండలంలోని గుడిదొడ్డి గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ లో భాగంగా గుర్తించిన పనుల ఆమోదం కొరకు ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామ సర్పంచ్ వరలక్ష్మి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... గ్రామంలో నీటి నిల్వ కట్టడాలను నిర్మించుకుని భవిష్యత్తులో రాబోయే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతను నిర్మించుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే రైతులు తమ పొలాల వద్ద నీటి కుంటలను ఏర్పాటు చేసుకొని నీటిని సంరక్షించాలని, ఏ ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా అధికారి ఏపీడీ డీఆర్డీఏ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఒక పంట కుంట, ఊరికి ఒక ఊట కుంటను తప్పనిసరిగా నిర్మించుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి వాటిని చేపట్టి గ్రామాభివృద్ధికి అందరూ దోహదపడాలని ఆకాంక్షించారు. టెక్నికల్ అసిస్టెంట్ అశోక్ మాట్లాడుతూ గ్రామంలో తక్షణమే నీటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు తాగు, సాగు నీరు కరువవుతుందని హెచ్చరించారు. ఇందుకుగాను గ్రామంలో నీటిని నిల్వ చేసుకునే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ గ్రామసభలో సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రణాళికా పనులకు ఆమోదం తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.