ప్రజా భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి

ముఖ్యమైన పాయింట్స్:గుడిదొడ్డిలో ఘనంగా గ్రామసభ నిర్వహణ జోగులాంబ గద్వాల 2 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఐజ గ్రామ సభలతోనే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయని స్పష్టం చేస్తూ, ఐజ మండలంలోని గుడిదొడ్డి గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ లో భాగంగా గుర్తించిన పనుల ఆమోదం కొరకు ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామ సర్పంచ్ వరలక్ష్మి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... గ్రామంలో నీటి నిల్వ కట్టడాలను నిర్మించుకుని భవిష్యత్తులో రాబోయే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతను నిర్మించుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే రైతులు తమ పొలాల వద్ద నీటి కుంటలను...