Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి

Author
Posted By Telangana Vaartha
| 02 Oct 2026, 05:01 PM | తెలంగాణ Telangana
మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి

నేర ప్రవృత్తి, ఇతరులను ఇబ్బందులకు గురిచేసే తత్వాన్ని మార్చుకోవాలి..
. సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట:- జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.నరసింహ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింస, ధర్మం అనే మార్గాలను అనుసరించి దేశ ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంలో ఏకతాటిపై నడిపించి దేశని స్వతంత్రం తేవడంలో కీలకపాత్ర పోషించిన మహానీయుడని అన్నారు. ఆయన చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలను ఎస్పీ స్మరించుకున్నారు. “జై జవాన్ – జై కిసాన్” నినాదంతో దేశ రక్షణలో సైనికుల పాత్రను, దేశాభివృద్ధిలో రైతుల ప్రాధాన్యతను చాటిచెప్పారని అన్నారు. దేశ రక్షణ, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహానుభావులు చూపిన మంచి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఎస్పీ సూచించారు. సమాజానికి ఇబ్బందులు కలిగించే నేర ప్రవృత్తి, ఇతరులను ఇబ్బందులకు గురిచేసే తత్వాన్ని విడనాడి, మంచి వ్యక్తిత్వంతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. మహానుభావుల ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ముడ్ డీఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నారాయణరాజు, ప్రవీణ్ కుమార్, జానయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, క్లోజ్ టీం ఇన్స్పెక్టర్ నవీన్, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, ట్రాన్స్‌పోర్ట్ ఆర్ఎస్ఐ సురేశ్, ఎస్సైలు సాయిరాం, అన్వర్, అశోక్, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు రమేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్ తో పాటు ఆర్ముడ్ సిబ్బంది పాల్గొన్నారు.

మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.