మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి

నేర ప్రవృత్తి, ఇతరులను ఇబ్బందులకు గురిచేసే తత్వాన్ని మార్చుకోవాలి.. . సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ సూర్యాపేట:- జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.నరసింహ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింస, ధర్మం అనే మార్గాలను అనుసరించి దేశ ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంలో ఏకతాటిపై నడిపించి దేశని స్వతంత్రం తేవడంలో కీలకపాత్ర పోషించిన మహానీయుడని అన్నారు. ఆయన...