Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

నంబర్ ప్లేట్ అంకెలు మారుస్తూ చలాన్లకు ఎగవేత

Author
Posted By Telangana Vaartha
| 02 Oct 2026, 11:18 AM | తెలంగాణ Telangana
నంబర్ ప్లేట్ అంకెలు మారుస్తూ చలాన్లకు ఎగవేత

పోలీసుల దృష్టిని మళ్లించి ఇతర వాహనాలకు చలాన్లు పడేలా చేసిన కారు డ్రైవర్
ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు ట్రాఫిక్ ఎస్ఐ యాదవేంద్రారెడ్డి
సూర్యాపేట:
అక్టోబర్ 1 తన కారుకు ట్రాఫిక్ చలాన్లు పడకుండా తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌పై ఉన్న అంకెలను మారుస్తూ, పోలీసుల దృష్టిని మళ్లించి ఇతర వాహనాలకు చలాన్లు పడేలా చేస్తున్న ఓ కారు డ్రైవర్‌ను సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. నంబర్ ప్లేట్‌లోని అంకెలను మార్చడం ద్వారా తన వాహనానికి బదులుగా అదే నంబర్‌గా కనిపించే ఇతర వాహనాలపై చలాన్లు పడేలా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై సూర్యాపేట ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. వాహన నంబర్ ప్లేట్‌లో అంకెలను మార్చడం, నంబర్‌ను తారుమారు చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. పట్టుబడిన కారుపై కేసు నమోదు చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇకపై ఎవరైనా తమ వాహనాలకు చలాన్లు పడకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్‌లో అంకెలను మార్చడం, ఇతర వాహనాలకు చలాన్లు పడేలా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ యాదవేంద్ర రెడ్డి హెచ్చరించారు. వాహనదారులు నంబర్ ప్లేట్లను ఎలాంటి మార్పులు చేయకుండా నిబంధనల ప్రకారం వినియోగించాలని సూచించారు. కారును డ్రైవర్ని అదుపులో తీసుకొని సూర్యాపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.