Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 01 Oct 2026, 09:44 PM | తెలంగాణ Telangana
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి

నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో తిరుమలగిరి క్యాంప్ కార్యాలయంలో సన్నాహక సమావేశం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బడుగుల లింగయ్య యాదవ్ హాజరుకాగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి, యుగంధర్, వైవీ, ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఒక ఇన్‌చార్జిని నియమించి అర్హులైన పట్టభద్రులను పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేయించాలని అన్నారు ఇప్పటికే ప్రారంభమైన ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రతి మండలంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి పట్టభద్రులకు సహకారం అందించాలని సూచించారు. గతంలో తుంగతుర్తి నియోజకవర్గంలో 12,537 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, ఈ సంఖ్యను 15 వేలకు పైగా పెంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 2023 నవంబర్ 1లోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్హులైన వారందరూ ఫారం–18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. బుల్లెట్‌ ట్రైన్ మార్గంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్‌ఎస్ సూర్యాపేట మీదుగా వెళ్లాల్సిన బుల్లెట్‌ ట్రైన్ మార్గాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు కేవలం ధర్నాలు, ఆందోళనలకు పరిమితం కాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి ప్రతిపాదిత మార్గాన్ని మార్చేలా చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. సిరిసిల్లలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కూడా బీఆర్‌ఎస్ నాయకులు తప్పుబట్టారు. కేటీఆర్ విద్యార్హతలు, వృత్తిపరమైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీలపై విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. మూడేళ్ల పాలనలో తెలంగాణ వెనుకబడిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, మెగా డీఎస్సీ, జీవో 46 రద్దు, రాజీవ్ యువ వికాసం వంటి హామీలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.ఇకపై వినతిపత్రాలు ఇవ్వడం కాకుండా ఎన్నికల ద్వారా తమ సమస్యలపై ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని పట్టభద్రులకు బీఆర్‌ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశంగా వినియోగించుకోవాలని కోరారు.ప్రతి మండలంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అర్హులైన పట్టభద్రులు వాటిని వినియోగించుకుని ఓటర్లుగా నమోదు కావాలని సూచించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి కొమ్మినేని సతీష్ వార్డు కౌన్సిలర్స్ గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.