ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి
నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో తిరుమలగిరి క్యాంప్ కార్యాలయంలో సన్నాహక సమావేశం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బడుగుల లింగయ్య యాదవ్ హాజరుకాగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి, యుగంధర్, వైవీ, ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఒక ఇన్చార్జిని నియమించి అర్హులైన పట్టభద్రులను పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేయించాలని అన్నారు ఇప్పటికే ప్రారంభమైన ఎన్రోల్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రతి మండలంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి...