Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ బండారు రాజాకు ఘన సన్మానం

Author
Posted By Telangana Vaartha
| 01 Oct 2026, 06:17 PM |
రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ బండారు రాజాకు ఘన సన్మానం

suryapet District:- ఇటీవల రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన బండారు రాజాను గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయతగా పలకరిస్తూ అందరితోటి అజ్జాతశత్రువుగా పేరు సంపాదించుకున్న బండారు రాజా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో ఎంతోమంది కి రక్తము సరిపోక ప్రాణాలు కోల్పోతుంటారని, రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎల్లవేళలా రక్తము అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలని తెలిపారు. వీరి వెంట బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు రజాక్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి జీడి బిక్షము, నాయకులు గుజ్జ యుగేందర్, గాలి సాయి, కొండపల్లి సాగర్ రెడ్డి, మీలా వంశీ, వాంకుడోత్ వెంకన్న, మద్దెల వీరస్వామి, అమరవాది శ్రవణ్ , కొల్లూరు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.