రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ బండారు రాజాకు ఘన సన్మానం
suryapet District:- ఇటీవల రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన బండారు రాజాను గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయతగా పలకరిస్తూ అందరితోటి అజ్జాతశత్రువుగా పేరు సంపాదించుకున్న బండారు రాజా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో ఎంతోమంది కి రక్తము సరిపోక ప్రాణాలు కోల్పోతుంటారని, రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎల్లవేళలా రక్తము అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలని తెలిపారు. వీరి వెంట బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు జిల్లా రైతు సమన్వయ సమితి...