Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్లలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం ఇవ్వాలి

Author
Posted By Telangana Vaartha
| 30 Sep 2026, 11:41 PM | తెలంగాణ Telangana
శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్లలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం ఇవ్వాలి

తెలంగాణ రాష్ట్ర ఎస్ పి ఎస్ మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్
ఖమ్మం :
తెలంగాణ రాష్ట్ర ఎస్ పి ఎస్ మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శి కొర్రి సైదయ్య & చిన్న బొస్క నరేష్ ల సారథంలో ఖమ్మం తిరుమలపాలెం లో ప్రస్తుతం 50 పడకలు ఉన్నటువంటి శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్లను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు అక్కడ జీతాలు మరియు విధి నిర్వహణ లోపాలను ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కరిశ జగదీష్ అడిగి తెలుసుకుని వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ పి ఎస్ మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని సమస్యలపై పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ పి ఎస్ మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాతకి అనిల్ కుమార్, ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు కోటమర్తి వెంకన్న, అనగానే ఉదయ్ కుమార్ , బోనాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు .

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.