Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

* మొగల్ రావు చెరువు గ్రామం లో పౌర హక్కుల దినోత్సవం

Author
Posted By Telangana Vaartha
| 30 Sep 2026, 08:19 PM | జోగులాంబ గద్వాల్
* మొగల్ రావు చెరువు గ్రామం లో పౌర హక్కుల దినోత్సవం

వివక్ష లేని సమాజం కోసం కలిసిమెలిసి ఉండాలి.
ఎమ్మార్వో శ్రీకాంత్ రెడ్డి.

జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల .మండలంలోని మొగలి రావులచెరువు గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, , ఏఎస్ఐ సుధాకర్ , హెడ్ కానిస్టేబుల్ రాజవర్ధన్ రెడ్డి,మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ , మొగల్ రావులచెరువు గ్రామపంచాయతీ కార్యదర్శి , వివిధ శాఖల అధికారులు ఉన్నారు . ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మొగల్ రావులచెరువు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు, గ్రామ ప్రజలందరూ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు. రెండు గ్లాసుల విధానం ఉండరాదని, దేవాలయాల్లోకి ప్రవేశాన్ని అడ్డుకునే ప్రయత్నాలను మానుకోవాలని స్పష్టం చేశారు. అందరికీ సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దళితుల పట్ల వివక్ష చూపరాదని, ఎవరైనా వివక్షకు పాల్పడితే వెంటనే మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని, తక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్లే నేడు ప్రజలంతా ఇంత స్వేచ్ఛను అనుభవిస్తున్నారని గుర్తుచేశారు. కుల, మత, వర్ణ, వర్గ విభేదాలు పక్కన పెట్టి గ్రామంలో ప్రశాంతమైన వాతావరణాన్ని అలవర్చుకోవాలని కోరారు. సమాజంలో కొన్నిసార్లు భూ వివాదాలు, కులాల మధ్య తలెత్తే ఘర్షణల్లో దళితులు వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సందర్భాల్లో గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, సామాజిక సేవా సంఘాలు బాధ్యతాయుతంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, జీపీఓ, వార్డు సభ్యులు, ఎస్సీ హాస్టల్ వార్డెన్, గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.