Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వయోవృద్ధులు–విద్యార్థులతో యాక్టివ్ ఏజింగ్, వెల్‌నెస్ ర్యాలీ

Author
Posted By Telangana Vaartha
| 30 Sep 2026, 08:17 PM | జోగులాంబ గద్వాల్
వయోవృద్ధులు–విద్యార్థులతో యాక్టివ్ ఏజింగ్, వెల్‌నెస్ ర్యాలీ

మహిళలు, శిశువులు, దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజెన్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వయోవృద్ధుల సంక్షేమం మరియు సాధికారత వారోత్సవాలు–2026 లో భాగంగా Active Ageing, Wellness & Intergenerational Walkathon కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల చింతలపేట నుండి ఇండోర్ స్టేడియం వరకు విద్యార్థులు, వయోవృద్ధులు కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా సంక్షేమ అధికారి (DWO) శ్రీమతి డి.సునంద జెండా ఊపి ప్రారంభించారు...
అనంతరం ఇండోర్ స్టేడియంలో వయోవృద్ధులు మరియు విద్యార్థుల కోసం ప్రాణాయామం,యోగా ప్రదర్శనతో పాటు శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వయోవృద్ధులు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ చురుకైన జీవితాన్ని కొనసాగించాలని, ప్రతిరోజూ నడక, యోగా, ప్రాణాయామం మరియు ధ్యానం చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ శ్రీ.రిజ్వాన్ బాషా షేక్, I.A.S., గారు మాట్లాడుతూ, వయోవృద్ధులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజూ నడక, యోగా, ప్రాణాయామం మరియు ధ్యానం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. చురుకైన జీవనశైలి ద్వారా వయోవృద్ధులు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వయోవృద్ధులు మరియు యువత మధ్య పరస్పర గౌరవం, అనుబంధం, ఆరోగ్య అవగాహన మరియు తరాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో...
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ శ్రీ సంగాల అయ్యపు రెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడుశ్రీ.లక్ష్మారెడ్డి,డీసీపీఓ శ్రీ.నరసింహ,శ్రీమతి. Dr.సులేఖ, యోగా బోధకురాలు శ్రీమతి.గాయిత్రి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి.రేణుక ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ నిర్వాకుడు మహేష్ నాయుడు తో పాటు మహిళా,శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు మరియు వయోవృద్ధులు పాల్గొన్నారు...

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.