Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సూర్యాపేట జిల్లాలో ఎస్‌ఐ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Author
Posted By Telangana Vaartha
| 29 Sep 2026, 11:11 PM |
సూర్యాపేట జిల్లాలో ఎస్‌ఐ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఉచిత వసతి, పౌష్టికాహారంతో కూడిన భోజనం, రాత పరీక్షకు ప్రత్యేక శిక్షణ, ఫిజికల్ ఈవెంట్స్‌లో సాధన

సూర్యాపేట జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులు పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె. నరసింహ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం (45) రోజుల పాటు ప్రత్యేక ప్రిలిమ్స్ క్రాష్ కోర్సు, ఉచిత శారీరక సామర్థ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
నేటి నుండి అభ్యర్థులు శిక్షణ కొరకు సూర్యాపేట జిల్లా వాసులు దరఖాస్తు చేసుకోవాలని , ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు పూర్తి ఉచితంగా వసతి మరియు భోజనం అందించనున్నారు. పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షల కోసం అనుభవజ్ఞులైన అధ్యాపకులతో సమగ్ర సిలబస్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు, పోలీస్ గ్రౌండ్‌లో నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో ప్రతిరోజూ ఫిజికల్ ఈవెంట్స్‌లో శిక్షణ అందించనున్నారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో పాల్గొనదలచిన అర్హులైన అభ్యర్థుల నుంచి గూగుల్ ఫారం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు కింది లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు లింక్: https://suryapet.telangana.gov.in/ లో గూగుల్ ఫారం లింక్‌ను చూపబడుతుంది.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరియు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక, శిక్షణకు సంబంధించిన తదుపరి వివరాలు సంబంధిత అధికారులు తెలియజేస్తారు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, కల్పిస్తున్న ఉచిత శిక్షణ, భోజనం, వసతి సదుపాయాలను వినియోగించుకుంటూ పోలీస్ ఉద్యోగాల సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్, తేజస్ నందలాల్ పవార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె. నరసింహ పిలుపునిచ్చారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.