Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కేసుల దర్యాప్తులో ప్రణాళిక ప్రకారం కృషి.

Author
Posted By Telangana Vaartha
| 29 Sep 2026, 11:09 PM |
కేసుల దర్యాప్తులో ప్రణాళిక ప్రకారం కృషి.

ముఖ్యమైన పాయింట్స్:

  • ఎస్పీ నరసింహ వీడియో కాన్ఫరెన్స్

- కేసుల దర్యాప్తులో ప్రణాళిక ప్రకారం కృషి.
- దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి.
- సాక్ష్యాల సేకరణలో ఆలస్యం లేకుండా త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు.
– సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ.

సూర్యాపేట: కేసుల దర్యాప్తులో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం చేయకుండా బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు.
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బాలలపై నేరాలు, చీటింగ్ కేసులు, దాడి కేసులు తదితర కేసులను ప్రత్యేకంగా సమీక్షించారు. ఆయా కేసుల్లో దర్యాప్తు ఏ దశలో ఉందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, పెండింగ్‌కు గల కారణాలను సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని, దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. కేసులకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం, నమోదు చేయడంలో ఎలాంటి ఆలస్యం చేయరాదని తెలిపారు. సాక్ష్యాలు, ఆధారాలను నిబంధనల ప్రకారం సేకరించి భద్రపరచడంతో పాటు, దర్యాప్తులో చేపట్టిన ప్రతి చర్యను రికార్డులో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. కేసుల్లో నిందితుల అరెస్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, చట్టపరంగా నోటీసులు జారీ చేయాల్సిన సందర్భాల్లో వాటిని కూడా ఆలస్యం చేయకుండా జారీ చేయాలని సూచించారు. దర్యాప్తులో ప్రతి అంశాన్ని పద్ధతి ప్రకారం నమోదు చేస్తూ, కేసులను బలమైన ఆధారాలతో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన దర్యాప్తు చర్యలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. బాలలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన అన్ని చర్యలను సకాలంలో చేపట్టాలని తెలిపారు. అలాగే చీటింగ్, దాడి తదితర కేసుల్లో కూడా దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేసి, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు త్వరగా న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. కోర్టులతో సమన్వయంతో పనిచేస్తూ కేసులకు సంబంధించిన అవసరమైన పత్రాలు, ఆధారాలు, నివేదికలను సకాలంలో సమర్పించాలని ఎస్పీ తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి తన పరిధిలోని పెండింగ్ కేసులపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ, దర్యాప్తు పురోగతిని ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, డీసీఆర్‌బీ ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.