కేసుల దర్యాప్తులో ప్రణాళిక ప్రకారం కృషి.

ముఖ్యమైన పాయింట్స్:ఎస్పీ నరసింహ వీడియో కాన్ఫరెన్స్ - కేసుల దర్యాప్తులో ప్రణాళిక ప్రకారం కృషి. - దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి. - సాక్ష్యాల సేకరణలో ఆలస్యం లేకుండా త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు. – సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ. సూర్యాపేట: కేసుల దర్యాప్తులో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం చేయకుండా బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి...