Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అన్నదురై నగర్‌లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

Author
Posted By Telangana Vaartha
| 29 Sep 2026, 11:07 PM | హైదరాబాద్
అన్నదురై నగర్‌లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

ముఖ్యమైన పాయింట్స్:

  • 50 వాహనాలు సీజ్.. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ

డీఎస్పీ, సీఐ, ఐదుగురు ఎస్సైలు సహా 50 మంది పోలీసుల బృందంతో తనిఖీలు...
సూర్యాపేట:-
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా సూర్యాపేట పట్టణంలోని అన్నదురై నగర్‌లో మంగళవారం సాయంత్రం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో, రూరల్ సీఐ రాజశేఖర్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ, సీఐ, ఐదుగురు ఎస్సైలు సహా సుమారు 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా కాలనీలోని ప్రతి ఇంటినీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, వాహనాల పత్రాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 50 వాహనాలను సీజ్ చేశారు. అనుమానాస్పద పరిస్థితులు, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ..ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం, నేరాలను అరికట్టడం, ప్రజల్లో పోలీసులపై నమ్మకం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో భాగంగానే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. కాలనీల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వారి వివరాలను తెలుసుకోవాలని, గుర్తింపు లేని వ్యక్తులకు ఇళ్లను అద్దెకు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన అన్ని అనుమతి పత్రాలను కలిగి ఉండాలని, రోడ్డు ప్రయాణంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
గంజాయి, మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి.
గంజాయి, ఇతర మత్తు పదార్థాలు కాలనీల్లోకి రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు, స్థానికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. గంజాయి యువత జీవితాలను నాశనం చేస్తుందని, మత్తు పదార్థాల అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అక్రమ రవాణా వంటి విషయాలు గుర్తిస్తే డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి...
కాలనీల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని డీఎస్పీ పేర్కొన్నారు. ఇళ్ల యజమానులు, కాలనీ వాసులు ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసులు రాత్రింబవళ్లు గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారని తెలిపారు. “ప్రజల రక్షణ కోసమే నిరంతర తనిఖీలు. వాహనదారుల్లో మార్పు తీసుకురావడానికే జరిమానాలు, చలాన్లు విధిస్తున్నాం. నేరాల నివారణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలి” అని డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సైలు, రూరల్ ఎస్సై, ట్రాఫిక్ ఎస్సైతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

అన్నదురై నగర్‌లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.