అన్నదురై నగర్లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
ముఖ్యమైన పాయింట్స్:50 వాహనాలు సీజ్.. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ డీఎస్పీ, సీఐ, ఐదుగురు ఎస్సైలు సహా 50 మంది పోలీసుల బృందంతో తనిఖీలు... సూర్యాపేట:- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా సూర్యాపేట పట్టణంలోని అన్నదురై నగర్లో మంగళవారం సాయంత్రం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో, రూరల్ సీఐ రాజశేఖర్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ, సీఐ, ఐదుగురు ఎస్సైలు సహా సుమారు 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా కాలనీలోని ప్రతి ఇంటినీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇళ్లలో నివసిస్తున్న...