Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

త్వరలో ఇందిరమ్మ బీమా పథకంతో వారికి రూ.5లక్షల ఆర్ధిక ధీమా

Author
Posted By GKSir
| 29 Sep 2026, 03:56 PM | హైదరాబాద్
త్వరలో ఇందిరమ్మ బీమా పథకంతో వారికి రూ.5లక్షల ఆర్ధిక ధీమా

telangana :- తెలంగాణలో పేద కుటుంబాలకు మరో ముఖ్యమైన సంక్షేమ పథకం రాబోతోంది. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించే 'ఇందిరమ్మ బీమా' పథకాన్ని నవంబరు 19న ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో ఆదివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, పరిశీలన చేసిన అనంతరం చింతకాని మండలం నాగులవంచలో బూత్ లెవల్ ఏజెంట్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత బీఎల్‌ఏలపై ఉందని సూచించారు. పార్టీ, ప్రభుత్వం ఎప్పుడూ వారికి అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తామని కూడా పేర్కొన్నారు.
'ఇందిరమ్మ బీమా' పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అయన అన్నారు. ఈ పథకం అమలు కావడంతో అనేక మంది కుటుంబాలకు ఊరట కలుగుతుందని అంచనా. ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా కవరేజ్ అందించటానికి నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.