త్వరలో ఇందిరమ్మ బీమా పథకంతో వారికి రూ.5లక్షల ఆర్ధిక ధీమా

telangana :- తెలంగాణలో పేద కుటుంబాలకు మరో ముఖ్యమైన సంక్షేమ పథకం రాబోతోంది. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించే 'ఇందిరమ్మ బీమా' పథకాన్ని నవంబరు 19న ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో ఆదివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, పరిశీలన చేసిన అనంతరం చింతకాని మండలం నాగులవంచలో బూత్ లెవల్ ఏజెంట్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత బీఎల్‌ఏలపై ఉందని సూచించారు. పార్టీ, ప్రభుత్వం ఎప్పుడూ వారికి అండగా...