Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Author
Posted By Telangana Vaartha
| 27 Sep 2026, 05:25 PM | హైదరాబాద్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • లయన్స్ ఐ హాస్పిటల్ అధ్యక్షుడు మీలా మహదేవ్

సూర్యాపేట:- ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ వ్యాపారవేత్త, లయన్స్ ఐ హాస్పిటల్ అధ్యక్షుడు మీలా మహదేవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ లయన్స్ ఐ హాస్పిటల్‌లో మలక్‌పేట యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ఉచిత వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి పరీక్షలతో పాటు షుగర్, బీపీ, 2డీ ఎకో, ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, గుండె, స్త్రీ, ఎముకలు, రక్తనాళాలు, సాధారణ వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కె.వి. ప్రసాద్, వైస్ గవర్నర్లు కోడె సతీష్, గుడిపూడి వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాధి, కౌన్సిలర్ చిలుముల సునీల్ రెడ్డి, సెక్రటరీ పెండం చంద్రశేఖర్, ట్రెజరర్ సి.హెచ్. శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ మిరియాల సుధాకర్, వైస్ చైర్మన్ తోట శ్యాంప్రసాద్, పీఆర్వో రాచర్ల కమలాకర్, ప్రెసిడెంట్ యాదగిరి, చిలుముల సైదిరెడ్డి, మేనేజర్ తల్లాడ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.