ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ముఖ్యమైన పాయింట్స్:లయన్స్ ఐ హాస్పిటల్ అధ్యక్షుడు మీలా మహదేవ్ సూర్యాపేట:- ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ వ్యాపారవేత్త, లయన్స్ ఐ హాస్పిటల్ అధ్యక్షుడు మీలా మహదేవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ లయన్స్ ఐ హాస్పిటల్‌లో మలక్‌పేట యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ఉచిత వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి పరీక్షలతో పాటు షుగర్, బీపీ, 2డీ ఎకో, ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, గుండె, స్త్రీ, ఎముకలు, రక్తనాళాలు, సాధారణ వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో...