Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఘనంగా సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Author
Posted By Telangana Vaartha
| 26 Sep 2026, 05:29 PM | హైదరాబాద్
ఘనంగా సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

గుండాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని సీతారాంపురం గ్రామపంచాయతీ ఆవరణలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన వీర వనిత స్ఫూర్తిని కొనియాడుతూ వీరనా రీ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా పూలమాలతో,నివాళులర్పించడం జరిగింది.కార్యక్రమంలో వికలాంగుల హెల్పింగ్ సొసైటీ ఫౌండర్ అండ్ అధ్యక్షుడు సింగారం రమేష్ మాట్లాడుతూ గడీల పాలనకు - దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత సాకలి.అయిలమ్మ స్ఫూర్తిని నేటితరం యువత అందిపుచ్చుకోవాలని కోరారు. నేటి యువత పోరాట స్ఫూర్తిని కోల్పోతూ మత్తు పానీయాలకు,వ్యసనాలకు బానిసలు అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.కాబట్టి యువత చైతన్యం కలిగి పోరాట స్ఫూర్తిని నింపుకొని దేశం కోసం,దేశ సమగ్రత కోసం పాటుపడాలని తెలియజేశారు. గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న మాట్లాడుతూ.. ప్రతి మహిళ కూడా వీరనారి సాకలి ఐలమ్మ స్ఫూర్తిని కలిగి ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మల్లెపాక నరేష్, వార్డ్ మెంబర్స్ శ్రీను, మోహన్,శేఖర్, సుమతి, గ్రామ సెక్రెటరీ విజయ, అంగన్వాడీ టీచర్ వాణిశ్రీ, ఆశ వర్కర్ లావణ్య, కవిత, కృష్ణయ్య, శ్రీశైలం, సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.