ఘనంగా సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
గుండాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని సీతారాంపురం గ్రామపంచాయతీ ఆవరణలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన వీర వనిత స్ఫూర్తిని కొనియాడుతూ వీరనా రీ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా పూలమాలతో,నివాళులర్పించడం జరిగింది.కార్యక్రమంలో వికలాంగుల హెల్పింగ్ సొసైటీ ఫౌండర్ అండ్ అధ్యక్షుడు సింగారం రమేష్ మాట్లాడుతూ గడీల పాలనకు - దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత సాకలి.అయిలమ్మ స్ఫూర్తిని నేటితరం యువత అందిపుచ్చుకోవాలని కోరారు. నేటి యువత పోరాట స్ఫూర్తిని కోల్పోతూ మత్తు పానీయాలకు,వ్యసనాలకు బానిసలు అవుతున్నారు అని...