Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ఆందోళనకరం

Author
Posted By Telangana Vaartha
| 26 Sep 2026, 05:27 PM | మహబూబ్ నగర్
ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ఆందోళనకరం

ముఖ్యమైన పాయింట్స్:

  • సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు

ఈసీఐపై సమగ్ర విచారణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావాలి
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి: సీపీఐ
జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-
గద్వాల. ఎన్నికల వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు అన్నారు. శనివారం నాడు స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం గద్వాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే ఎన్నికల ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్కుమార్ తనపై వస్తున్న ఆరోపణలకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై ఎలాంటి అనుమానాలు తలెత్తినా వాటిపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందన్నారు. అలాంటిది ఏకపక్షంగా కేంద్ర బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనే విమర్శలు నేపథ్యంలో ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగం, చట్టాలు, ఈసీఐ నిబంధనల ప్రకారం జరుగుతుందని చెబుతోంది,కాని ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు కేవలం ప్రకటనలు కాకుండా పూర్తి స్థాయి పారదర్శక విచారణ, అవసరమైన రికార్డుల బహిరంగీకరణ, బాధ్యత నిర్ధారణ ద్వారా సమాధానం ఇవ్వాలని బి. ఆంజనేయులు డిమాండ్ చేశారు. దీనిపైన కేంద్ర బిజెపి ప్రభుత్వం తక్షణమే విచారణకు పోనుకోవాలని అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలగజేసుకొని విచారణ అనంతరం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం కాపాడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమని, ఆరోపణలపై స్వతంత్ర విచారణ ద్వారా తేల్చాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఎన్నికల సంఘం జవాబుదారీతనం, పారదర్శకతతో వ్యవహరించాలి అని బి. ఆంజనేయులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్కూర్ రంగన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భరత్, ప్రవీణ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సురేందర్, శివ, వంశీ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.