Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రపంచ హృదయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ను ఆహ్వానించిన

Author
Posted By Telangana Vaartha
| 26 Sep 2026, 05:14 PM | జోగులాంబ- గద్వాల్
ప్రపంచ హృదయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ను ఆహ్వానించిన

ముఖ్యమైన పాయింట్స్:

  • వడ్డేపల్లి శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ మంజుల ధర్మ, కౌన్సిలర్ డాక్టర్ విజయభాస్కర్

జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్తా ప్రతినిధి:- వడ్డేపల్లి. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు జమ్మలమడుగులో ఈ నెల 29న ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏఐ స్టెతస్కోప్ హార్ట్ చెకప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ని బీసీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ మంజుల ధర్మ కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఉపయోగించనున్న AI స్టెతస్కోప్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. హృదయ సంబంధిత ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గురించి 7వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ విజయ్ భాస్కర్ కలెక్టర్‌కు వివరించారు. అదేవిధంగా వడ్డేపల్లి మున్సిపాలిటీకి అసిస్టెంట్ ఇంజనీర్ (AE)ను నియమించాలని కోరుతూ కలెక్టర్‌ కి రిక్వెస్ట్ లెటర్ అందజేశారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల పనులు వేగవంతంగా చేపట్టేందుకు AE నియామకం అవసరమని వారు వివరించారు. ఈ వినతిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, త్వరలో వడ్డేపల్లి మున్సిపాలిటీకి AEని నియమించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ విజయభాస్కర్, 10వ వార్డు కౌన్సిలర్ తిమ్మప్ప, నాగరాజు, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ హృదయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ను ఆహ్వానించిన - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.