Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం : జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు

Author
Posted By A.Timma Gurudu
| 26 Sep 2026, 05:01 PM | Array
వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం : జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు

ముఖ్యమైన పాయింట్స్:

  • జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్., అన్నారు. తెలంగాణ వీరనారి, ధైర్యశాలి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్., కార్యాలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నిరంకుశత్వాన్ని ఎదిరించిన ధైర్యానికి ఐలమ్మ ప్రతీక అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అన్యాయాన్ని, నిరంకుశత్వాన్ని ఎదిరించి మొక్కవోని ధైర్యంతో పోరాడిన చాకలి ఐలమ్మ జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఆమె సాగించిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. మహిళా చైతన్యం, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం ఐలమ్మ చూపిన ధైర్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాయుధ దళ డీఎస్పీ నరేందర్ రావు, కార్యాలయ ఏఓ సాయికృష్ణ, ఆర్‌ఐలు నరేష్, వెంకటేష్, హరీఫ్, డీసీఆర్‌బీ సీఐ టాటా బాబు, ఐటీ, డీసీఆర్‌బీ, ఎస్‌బీ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.