వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం : జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు
ముఖ్యమైన పాయింట్స్:జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్., అన్నారు. తెలంగాణ వీరనారి, ధైర్యశాలి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్., కార్యాలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నిరంకుశత్వాన్ని ఎదిరించిన...