Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తల్లి పేరుపై ఒక మొక్క నాటుదాం..! పర్యావరణాన్ని కాపాడుదాం

Author
Posted By Telangana Vaartha
| 25 Sep 2026, 05:23 PM | జోగులాంబ గద్వాల్
తల్లి పేరుపై ఒక మొక్క నాటుదాం..! పర్యావరణాన్ని కాపాడుదాం

రాబోయే తరాలకు పచ్చని భవిష్యత్తును కానుకగా ఇద్దాం.
- కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.
ఎర్రవల్లి. మండల కేంద్రంలోని: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి తల్లి పేరుపై ఒక మొక్క నాటే లక్ష్యంతో ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో “తల్లి పేరుపై ఒక మొక్క” కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు, అంతస్తులు కూడబెట్టడం కంటే, వారికి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే నిజమైన సంపద అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుపై ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా రాబోయే తరాలకు పచ్చని భవిష్యత్తును అందించవచ్చని పేర్కొన్నారు. కరోనా సమయంలో వైరస్‌ నుంచి రక్షించుకోవడానికి మాస్కులు ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. “ఈరోజు మనం చెట్లను నాటకపోతే, భవిష్యత్తులో ఆక్సిజన్‌ కోసం ప్రతి ఒక్కరూ ఆక్సిజన్‌ బాటిల్‌ తగిలించుకుని తిరిగే పరిస్థితి రావచ్చు” అని ఆమె హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై బాధ్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీమతి స్రవంతి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు మాధవి, శిరీష, రేవతి, ప్రియాంకతో పాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అక్షయ, అక్షిత, హర్షద్, వరుణ్ వెంకట్ తేజ తోటి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తల్లి పేరుపై ఒక మొక్క నాటుదాం..! పర్యావరణాన్ని కాపాడుదాం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.