తల్లి పేరుపై ఒక మొక్క నాటుదాం..! పర్యావరణాన్ని కాపాడుదాం

రాబోయే తరాలకు పచ్చని భవిష్యత్తును కానుకగా ఇద్దాం. - కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఎర్రవల్లి. మండల కేంద్రంలోని: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి తల్లి పేరుపై ఒక మొక్క నాటే లక్ష్యంతో ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో “తల్లి పేరుపై ఒక మొక్క” కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు, అంతస్తులు కూడబెట్టడం కంటే, వారికి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే...