Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

విజయకృష్ణ మల్టీస్పెషాల్టి ఆసుపత్రిలో అన్ని రకాల ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు

Author
Posted By Telangana Vaartha
| 24 Sep 2026, 05:06 PM | హైదరాబాద్
విజయకృష్ణ మల్టీస్పెషాల్టి ఆసుపత్రిలో అన్ని రకాల ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు

అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీల క్యాష్ లెస్ వైద్య సదుపాయాలు
సూర్యాపేట లో గత 30 సంవత్సరాలుగా వైద్య రంగంలో అన్ని రకాల సౌకర్యాలతో కూడిన సేవలను ప్రజలకు అందిస్తున్న శ్రీ విజయ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మరింతగా తమ వైద్య సేవలను విస్తరించింది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఆరోగ్యశ్రీ, జర్నలిస్టుల ఆరోగ్య పథకం తదితర సేవలు ప్రజలకు అందించడంలో భాగంగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం విభాగం కింద ప్రభుత్వ ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చిన విధంగానే సూర్యాపేట విజయ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా అనుమతి ఇచ్చిందని నిర్వాహకులు, సీనియర్ డాక్టర్లు డాక్టర్ రామకృష్ణ విజయలక్ష్మి లు గురువారం వివరించారు. వివిధ రకాల వైద్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంతో పాటు, విలేకరులకు జే హెచ్ ఎస్ (జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్) ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హెచ్ ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్) విభాగాల కింద ఆధునిక సాంకేతికతతో వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుని హైదరాబాదు స్థాయిలో లభించే శస్త్ర చికిత్సలను సూర్యాపేటలోనే అనుభవం గల సీనియర్ వైద్యుల ద్వారా అందిస్తున్నామని వారు తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా మాత్రమే కాకుండా స్టార్ హెల్త్, ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, టాటా ఏఐజి, రిలయన్స్ జనరల్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లాంబార్డ్, రాయల్ సుందరం ఇన్సూరెన్స్, చోళ మండలం ఇన్సూరెన్స్, ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లతో పాటు మొత్తం 38 రకాల ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్సూరెన్స్ కలిగి ఉన్న వారికి క్యాష్ లెస్ వైద్య సౌకర్యం అందిస్తున్నట్టు, విజయకృష్ణ మల్టీస్పెషల్టి హాస్పిటల్ లో ఆధునిక టెక్నాలజీ అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ రామకృష్ణ, విజయలక్ష్మి లు కోరారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.