Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సద్దుల చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రక్రియ పరిశీలించిన ఎస్పి నరసింహ

Author
Posted By Telangana Vaartha
| 24 Sep 2026, 12:29 AM | హైదరాబాద్
సద్దుల చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రక్రియ పరిశీలించిన ఎస్పి నరసింహ

ముఖ్యమైన పాయింట్స్:

  • నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు... ఎస్పి
  • సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిమజ్జనాల ప్రక్రియ పరిశీలన.

గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు (మినీ ట్యాంక్ బండ్ mini tankband) వద్ద జరుగుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియను జిల్లా ఎస్పీ కె. నరసింహ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నిమజ్జనాల సందర్భంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల కమాండ్ కంట్రోల్ వ్యవస్థను పరిశీలించిన నిమజ్జన ప్రాంతంలోని మూడు క్రేన్ల వద్ద కొనసాగుతున్న నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. నిమజ్జనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిమజ్జన ప్రాంతంలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం నిమజ్జన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదిక ద్వారా ప్రాంగణంలో భద్రత పరిశీలించి భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడారు, నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించినట్లుగానే నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అందరూ సహకారంతో, శాంతియుతంగా ముగించుకోవాలని కోరారు. ప్రత్యేకంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు మరియు పెద్దలు నీటిలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వచ్చే ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసు మరియు ఇతర శాఖల అధికారులకు సహకరించాలని, నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఎస్పీ కోరారు.
ఎస్పి గారి వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సద్దుల చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రక్రియ పరిశీలించిన ఎస్పి నరసింహ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.