సద్దుల చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రక్రియ పరిశీలించిన ఎస్పి నరసింహ
ముఖ్యమైన పాయింట్స్:నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు... ఎస్పిసీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిమజ్జనాల ప్రక్రియ పరిశీలన. గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు (మినీ ట్యాంక్ బండ్ mini tankband) వద్ద జరుగుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియను జిల్లా ఎస్పీ కె. నరసింహ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నిమజ్జనాల సందర్భంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల కమాండ్ కంట్రోల్ వ్యవస్థను పరిశీలించిన నిమజ్జన ప్రాంతంలోని మూడు క్రేన్ల వద్ద కొనసాగుతున్న నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. నిమజ్జనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా, అన్ని శాఖల...