Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం.

Author
Posted By Telangana Vaartha
| 24 Sep 2026, 12:24 AM |
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం.

జోగులాంబ గద్వాల 23 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలోని ప్రతి విద్యార్థికి సమగ్ర ఆరోగ్య పరిక్షలు – హెల్త్ ప్రొఫైల్ కార్డులు:-
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించే లక్ష్యంతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల సమగ్ర ఆరోగ్య పరిక్షలు మరియు హెల్త్ ప్రొఫైల్ నమోదు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగ ఈ నెల 24 గురువారం నుండి ప్రారంభించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు,DMHO- డా. సంధ్యా కిరణ్మై పర్యవేక్షణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధి బాలికల విద్యాలయాలు, గురుకుల పాఠశాలల్లో మరియు కళాశాలల్లో, 6వ తరగతి నుండి ఇంటర్మిడియట్ వరకు చదువుతున్న మొత్తం (43,419) మంది విద్యార్థులకు దశలవారిగ సమగ్ర వైద్య పరిక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య వివరాలను నమోదు చేయనున్నారు.
సమగ్ర వైద్య పరిక్షలు:-
వైద్య పరిక్షల్లో భాగంగ విద్యార్థుల ఎత్తు, బరువు, BMI, రక్తపోటు, పల్స్ రేట్, హీమోగ్లోబిన్ శాతం, బ్లడ్ గ్రూపింగ్, కంటి, చెవి-ముక్కు-గొంతు (ENT), గుండె, చర్మం, నాడి వ్యవస్థ, ఊపిరితిత్తుల ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలను పరిశీలిస్తారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు, పోషకాహార లోపాలు తదితర ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటారు. బాలికల ఆరోగ్యానికి సంబంధించి రుతుస్రావం మరియు సంబంధిత ఆరోగ్య అంశాలను కూడ నమోదు చేసి, అవసరమైన ఆరోగ్య అవగాహన, వైద్య సలహాలు అందించనున్నారు.
వైద్య పరిక్షల ద్వార సేకరించిన వివరాల ఆధారంగ ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగ హెల్త్ ప్రొఫైల్ కార్డు రూపొందించనున్నారు. విద్యార్థి ఆరోగ్య చరిత్ర, గుర్తించిన ఆరోగ్య సమస్యలు, అందించిన వైద్య సేవలు తదితర వివరాలను ఇందులో నమోదు చేస్తారు. తద్వార భవిష్యత్తులో విద్యార్థికి ఏదైన ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు గత ఆరోగ్య వివరాలను పరిశీలించి తగిన వైద్య సేవలు అందించేందుకు వీలవుతుంది.
పాఠశాలల వారిగ వైద్య బృందాలు:-
RBSK వైద్య బృందాల సహకారంతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సిబ్బంది పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరిక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం మండలాల వారిగ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి విద్యార్థి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు, ఈ కార్యక్రమం ద్వార విద్యార్థుల్లో ప్రారంభ దశలోనే ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వారికి తదుపరి పరిక్షలు, చికిత్స, రిఫరల్ సేవలు అందించేల చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమానికి వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంబంధిత పాఠశాలల సిబ్బంది వైద్య బృందాలకు సహకరించాలని కోరారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.