విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం.
జోగులాంబ గద్వాల 23 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలోని ప్రతి విద్యార్థికి సమగ్ర ఆరోగ్య పరిక్షలు – హెల్త్ ప్రొఫైల్ కార్డులు:- విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించే లక్ష్యంతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల సమగ్ర ఆరోగ్య పరిక్షలు మరియు హెల్త్ ప్రొఫైల్ నమోదు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగ ఈ నెల 24 గురువారం నుండి ప్రారంభించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు,DMHO- డా. సంధ్యా కిరణ్మై పర్యవేక్షణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధి బాలికల విద్యాలయాలు,...