Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మిల్లర్లపై దాడులను నిలిపివేసి ప్రభుత్వం చర్చలు జరపాలి

Author
Posted By Telangana Vaartha
| 22 Sep 2026, 07:20 PM | తాజా వార్తలు
మిల్లర్లపై దాడులను నిలిపివేసి ప్రభుత్వం చర్చలు జరపాలి

రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొండమీది గోవిందరావు
రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు
సూర్యాపేట:
రైస్ మిల్లర్ల పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ ఆకస్మిక దాడులను వెంటనే నిలిపివేసి మిల్లర్లతో ప్రభుత్వం జరిపి చర్చలు పరిష్కరించాలని రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొండమీది గోవిందరావు, కార్యదర్శి నరసింహ రావు డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడారు. సీఎంఆర్ ఒప్పందాన్ని ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలని, టెస్ట్ మిల్లింగ్ ద్వారా అవుట్ బర్న్ రేషియోను ఖరీఫ్, రబీ పంటలకు వేరువేరుగా నిర్ధారించి క్వింటాల్ ధాన్యానికి బిల్లింగ్ చార్జీని 150 కు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి రావాల్సిన సివిల్ సప్లై మిల్లింగ్ ట్రాన్స్పోర్ట్ డ్రై యేజ్ చార్జీలను చెల్లించి, 25% పెనాల్టీ, 12 శాతం వడ్డీని మాఫీ చేయాలని కోరారు. 2022, 23 రబీ టెండర్ ధాన్యం ధర న్యాయబద్ధంగా నిర్ణయించి రైస్ మిల్లులను వ్యవసాయ అనుబంధ సంస్థలు గా గుర్తించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని సరఫరా చేసి ధాన్యం నాణ్యతకు అనుగుణంగా బియ్యం రేషియోను నిర్ధారించాలని తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయి డిఫాల్ట్ అయిన మిల్లర్లకు లెక్కలు పూర్తిగా
తేల్చి బకాయిలు నాలుగు విడతలుగా చెల్లించాలని, ఖరీఫ్ ధాన్యాన్ని పూర్తిగా రా రైస్ గా, రబీ ధాన్యాన్ని పూర్తిగా బాయిల్డ్ రైస్ గా స్వీకరించి ఎఫ్ సిఐ కఠినమైన నిబంధనలను సడలించి రైస్ మిల్లర్ల 13 డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రా రైస్ మిల్లెట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి వంగవీటి నాగరాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు బచ్చు ఉపేందర్, చౌగాని బిక్షపతి, గౌరవ సలహాదారులు కాసాని వెంకటేశ్వర్లు, వజ్ర రైస్ మిల్ నిర్వాహకులు వట్టె జానయ్య యాదవ్, మల్లారెడ్డి, మధు, మురళి, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.