మిల్లర్లపై దాడులను నిలిపివేసి ప్రభుత్వం చర్చలు జరపాలి
రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొండమీది గోవిందరావు రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు సూర్యాపేట: రైస్ మిల్లర్ల పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ ఆకస్మిక దాడులను వెంటనే నిలిపివేసి మిల్లర్లతో ప్రభుత్వం జరిపి చర్చలు పరిష్కరించాలని రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొండమీది గోవిందరావు, కార్యదర్శి నరసింహ రావు డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడారు. సీఎంఆర్ ఒప్పందాన్ని ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా...