Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మూసి నీటిని విడుదల చేయాలి

Author
Posted By Telangana Vaartha
| 22 Sep 2026, 07:19 PM | తాజా వార్తలు
మూసి నీటిని విడుదల చేయాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా
  • అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

సూర్యాపేట: సూర్యాపేట మండల పరిధిలోని తాళ్లకాంపాడు, పెన్ పహాడ్ మండల పరిధిలోని సింగిరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన రైతులు మూసి ప్రాజెక్టు పరిధిలో 36, 37, 38, 40, తూముల కింద సుమారు 300 ఎకరాల వరి పొలాలను సాగు చేశామని కానీ మూసి నీరు రాక పొలాలు ఎండిపోతున్నాయని మంగళవారం మూసి నీటిని విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ హరి సింగ్ కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవక ఎల్ నినో ప్రభావంతో కుంటల్లో, చెరువుల్లో నీళ్లు లేక తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. మూసి సాగు నీటిని కొన్ని రోజులు ఇచ్చి అర్ధాంతరంగా నీటిని నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వేల రూపాయలు పెట్టి పెట్టుబడులు పెట్టి వరి పొలాలను సాగు వేశామని ప్రభుత్వం తక్షణమే స్పందించి మూసి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తాళ్ల ఖమ్మంపహాడు, సింగిరెడ్డిపాలెం గ్రామాల రైతులు ఎలక సైదులు, కాసర్ల లింగారెడ్డి, బి, సీతారాములు, యానాల సత్యం, పేర్ల లింగయ్య, జి, ఎలమంచయ్య, కె, నరసయ్య, జి, గణేష్, జి, శివ, ఎం, మహేష్, జి, సతీష్,, కొమ్మ సైదులు, పేర్ల చిన్న వెంకన్న, గుండాల రాంబాబు, గుండాల లింగయ్య, కొమ్మ లింగయ్య, పేర్ల మల్లయ్య, పి, లింగయ్య, కె, గోపయ్య, నామ రవి, జి, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.