Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

నాగారం మండలం MRPS MSP MSF నూతన మండల కమిటీల ఎన్నిక

Author
Posted By Telangana Vaartha
| 21 Sep 2026, 08:48 PM |
నాగారం మండలం MRPS MSP MSF నూతన మండల కమిటీల ఎన్నిక

నాగారం మండలం, సూర్యాపేట జిల్లా MRPS, MSP, MSF నూతన మండల కమిటీల ఎన్నిక
సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కుల వివక్షత లేని సమాజం కోసం మందకృష్ణ మాదిగ ఉద్యమం
బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ జిల్లా ఇన్‌చార్జ్

MRPS వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు తుంగతుర్తి నియోజకవర్గం, నాగారం మండల MRPS, MSP, MSF నూతన మండల కమిటీల ఎన్నిక సమావేశం MRPS సూర్యాపేట జిల్లా మాజీ కన్వీనర్ నాగారం మండల ఇన్‌చార్జ్, ఏపూరి రాజు మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశానికి
ముఖ్య అతిథులుగా
MRPS , MSP సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జ్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ సాధించడం ద్వారా దళిత సమాజంలో విద్య, ఉద్యోగ, రంగాలలో సమాన అవకాశాలు ఐక్యత ఏర్పడిందని సామాజికంగా అన్ని వర్గాల కోసం పోరాడి హక్కులను సాధించిన చరిత్ర దండోరా ఉద్యమానికి ఉన్నదని తెలుపుతూ కుల వివక్ష, పేదరికం, అణచివేత సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం, సాంఘిక అసమానతలు అణచివేత లేని సమ సమాజ స్థాపన నిర్మాణానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి భవిష్యత్ ఉద్యమ పోరాటంలో జాతి తోపాటు సబ్బండ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయడానికి క్షేత్రస్థాయిలో బలోపెతంకై నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు.
విశిష్ట అతిథులుగా
కందుకూరి సోమన్న మాదిగ
MRPS ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు
యాతాకుల రాజయ్య మాదిగ
MSP సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు
మల్లెపాక వెంకన్న మాదిగ
MEF జాతీయ ఉపాధ్యక్షులు
పాల్గొని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రాజ్యాధికార సాధనకై జరిగే పోరాటంలో సబ్బండ వర్గాల ప్రజలు బాగస్వామ్యం కావాలని తెలిపారు.
MRPS నాగారం మండల కమిటీ
అధ్యక్షులు, చిప్పలపల్లి మల్లేష్ మాదిగ, అధికార ప్రతినిధి, వంగాల శేఖర్ మాదిగ, ప్రధాన కార్యదర్శి(1,) సంపతి నరసయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శి (2)పేరాల పెద్ద శ్రీనివాస్ మాదిగ, ఉపాధ్యక్షులు, (1)ఆకారపు శ్రీను మాదిగ, (2)మల్లెపాక సుధాకర్ మాదిగ, (3)మల్లెపాక నరేందర్ మాదిగ, కోశాధికారి, పేరాల అర్జున్ మాదిగ, కార్యదర్శులు, (1) ఇటికాల స్వామి మాదిగ, (2)మల్లెపాక గణేష్ మాదిగ, (3)మల్లెపాక ప్రవీణ్ మాదిగ, (4)చిప్పలపల్లి హరి ప్రకాష్ మాదిగ, సహాయకార్యదర్శి, పాల్వాయి మహేష్ మాదిగ,లు
MSP నాగారం మండల కమిటీ
అధ్యక్షులు, మూరగుండ్ల ప్రభుదాస్ మాదిగ, అధికార ప్రతినిది, బూడిద విష్ణు మాదిగ, ప్రధాన కార్యదర్శి, (1) మల్లెపాక రాజు మాదిగ, (2) కొమ్ము సైదులు మాదిగ, ఉపాధ్యక్షులు, (1) మల్లెపాక సోమయ్య మాదిగ,(2) పేరాల నరేష్ మాదిగ, (3) ఈదుల యాదగిరి మాదిగ, కోశాధికారి, మల్లెపాక గోపి మాదిగ లు

MSF నాగారం మండల కమిటీ
అధ్యక్షులు, వంగూరి ప్రవీణ్ మాదిగ అధికార ప్రతినిధి, సూరారం ఉమేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి, పేరాల వెంకటేష్ మాదిగ లను ఎన్నిక చేయడం జరిగినది, గ్రామస్థాయిలో మండల స్థాయిలో ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం బలోపేతం చేయాలని నూతన కమిటీ బాధ్యులకు తెలియజేశారు

నాగారం మండలం MRPS MSP MSF నూతన మండల కమిటీల ఎన్నిక - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.