Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గణేష్ నిమజ్జన శోభ యాత్ర ప్రశాంత వాతావరణములో నిర్వహించుకోవాలి

Author
Posted By Telangana Vaartha
| 21 Sep 2026, 08:23 PM | తాజా వార్తలు
గణేష్ నిమజ్జన శోభ యాత్ర ప్రశాంత వాతావరణములో నిర్వహించుకోవాలి

CC కెమెరాలతో శోభాయాత్ర నిరంతర పర్యవేక్షణ
బుధవారం రోజున అన్ని గణేష్ విగ్రహాలు నిమజ్జనాలు పూర్తి చేయాలి.
నిమజ్జన ప్రాంతాల్లో బారి క్రేన్లు గజ ఈతగాళ్ల ఏర్పాట్లు
ఎల్ నినో ప్రభావంతో నీటి వనరులు తక్కువగా ఉన్నాయి, నీటిని కలుషితం చేయొద్దు.
ప్రమాదాలకు దూరంగా ఉండాలి.
ఎత్తైన విగ్రహాల తీసుకెళ్లే వారు మార్గం మధ్యంలో విద్యుత్ తీగలు గమనించాలి.
10 నిమిషాల్లో పోలీసు సేవలు అందేలా పెట్రో కార్, బ్లూ కోట్, హైవే పెట్రోలింగ్, బీట్ సిస్టమ్ బలోపేతం చేశాం.
అత్యవసర సమయంలో పోలీస్ సేవలకు డయల్ 112 కు ఫోన్ చేయొచ్చు.
కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

గణేష్ నవరాత్రులు జిల్లాలో అత్యంత రక్షణ భద్రత నడుమ భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి, నవరాత్రులు పూర్తి చేసుకుని జిల్లా వ్యాప్తంగా బుధవారం రోజున నిమజ్జనాలకు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి, ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని రకాల ముందస్తు భద్రతా ఏర్పాటు చర్యలు తీసుకుందని జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు తెలిపారు. జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా పది నిమిషాల వ్యవధిలో పోలీసు సేవలు అందేలా పెట్రో కార్ వాహనాలు, బ్లూకోట్స్, హైవే పెట్రోలింగ్, బీట్ సిస్టమ్ సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తమయ్యేలా ఆన్‌లైన్ విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నాము. గణేష్ శోభాయాత్ర, నిమర్జనం ప్రక్రియను జిల్లా పోలీసు కార్యాలయం నందునేర్పటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది అన్నారు. గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్ చేసి ముఖ్య పట్టణాల్లో నంబర్స్ ఇవ్వడం జరిగినది అని శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దల చెరువులో నిమార్జనానికి అన్ని ఏర్పాట్లు చేశాం అన్నారు. బుధవారం రోజున నిమజ్జనం కొరకు వినాయక విగ్రహాలను మండపాల నుంచి వీలైనంత త్వరగా బయలుదేరి పోలీసువారికి సహకరించగలరు అని ఉత్సవ కమిటీలను ఎస్పీ గారు కోరినారు. జిల్లా వ్యాప్తంగా 3150 విగ్రహాలు అనుమతి ఇచ్చాము అని తెలిపినారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీలు నిమర్జనం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా చెరువులు, కుంటల లలో నిమర్జనం చేసుకోవడం మంచిది. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. ఎత్తైన విగ్రహాల తీసుకెళ్లే వారు మార్గం మధ్యంలో విద్యుత్ తీగలు గమనించాలి. ఉత్సవాలు సోదరభావంతో అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలి అని కోరినారు. మార్గం మధ్యలో, నిమర్జనం కేంద్రాల వద్ద హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది. నిమర్జనం కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం, పెద్ద క్రేన్ లు అందుబాటులో ఉంచాం, లైటింగ్ ఏర్పాటు చేశాం, గజ ఈతగాలను ఏర్పాటు చేశాం అన్నారు, యువత ఆదర్శంగా ఉండాలి. ఎవ్వరూ గొడవలు పెట్టుకోవద్దు. శోభాయాత్ర సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదు, శోభాయాత్ర వాహనాలు నడిపే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. నిమర్జనం వెళ్లే వాహనాలు త్వరగా వెళ్ళాలి అని కోరారు. పిల్లలు, మహిళలు, వృద్దులు, ఈతరాని వారు నిమర్జనం ప్రదేశంలో దూరంగా ఉండాలి.
నిమజ్జనాలు వాయిదా వేయొద్దు.
బ్యాండ్ మేళం, సౌండ్ సిస్టం దొరకలేదనే కారణంతో గణేష్ నిమజ్జనాలను వాయిదా వేయవద్దని ఉత్సవ కమిటీలకు, భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాము. బుధవారం రోజున గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ఉదయమే త్వరగా ప్రారంభించి పూర్తి చేసుకోవాలి. డీజేలకు పూర్తిగా నిషేధం. అధిక శబ్దం వల్ల ఆరోగ్యంపై, పర్యావరణంపై, సమాజంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి, పరిమితికి మించిన శబ్దాల వల్ల వినికిడి లోపం, తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, రక్తపోటు, గుండె పోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. డీజే ఉపయోగించవద్దు. సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయాత్రను నిర్వహించుకోవాలని.

నిమజ్జన భద్రత కోసం 1200 మంది సిబ్బంది

గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా జిల్లా పోలీసు శాఖ బారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఆడిషనల్ ఎస్పీ లు, ముగ్గురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, మహిళ కానిస్టేబుల్స్, హోంగార్డులు, బాంబ్ స్క్వాడ్,డాగ్ స్క్వాడ్, ఏ.ర్ సిబ్బంది, హోంగార్డ్స్, స్పెషల్ పార్టీ తో కలిపి మొత్తం 1200 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.

సిసిటివి కెమెరాలు, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ తో పర్యవేక్షణ లో శోభ యాత్ర
జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులు, పట్టణాల్లో గణేష్ నిమజ్జన శోభయాత్రను 24/7 జిల్లా పోలీసు కార్యాలయం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. జిల్లావ్యాప్తంగా పోలీస్ శాఖ తరపున నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా మా ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ద్వారా పర్యవేక్షణ ఉంటుంది అన్నారు. అలాగే ఉత్సవాన్ని వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేస్తున్నాము అన్నారు.

నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి . జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెర్వు, మూసి రివర్ రత్నాపురం వద్ద, కోదాడ పెద్ద చెరువు వద్ద, మట్టపల్లి బ్రిడ్జి వద్ద, పాలకవీడు మండలం కృష్ణానది మహంకాళిగూడెం వద్ద, నేరేడుచర్ల పరిది చిల్లేపల్లి బ్రిడ్జి వద్ద పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పోలీసు పికెట్లు, ప్లడ్ లైట్లు, అవసరమైన బారి క్రేన్లు , ఏర్పాటు చేశామని, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉన్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగినది.

ముఖ్య పట్టనాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు

ఇవి కూడా చదవండి

నిమజ్జనం రోజున జిల్లా కేంద్రంలోని ప్రజలకు,వాహనదారులకు శోభ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శోభయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నాం. వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు శోభయాత్ర వాహనాలను ఒక క్రమపద్ధతిలో, ఒక వరుసలో వెళ్లేలా చూడాలి, పోలీసు వారికి సహకరించాలి.

మద్యం మత్తులో శోభాయాత్రలో పాల్గొనొద్దు.
నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో, ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఈ పవిత్రమైన వేడుకల్లో యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మద్యం మత్తులో శోభాయాత్రలో పాల్గొనడం పండుగ పవిత్రతను దెబ్బతీస్తుంది. కాబట్టి ఎవరూ మద్యం సేవించి ఊరేగింపునకు రాకూడదు. సమాజంలో యువతే శక్తి. క్రమశిక్షణ, భక్తిభావంతో మెలుగుతూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. ఊరేగింపు సమయంలో ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దు. చిన్నచిన్న కారణాలకు గొడవలు పడి పండుగ వాతావరణాన్ని, మీ భవిష్యత్తును పాడుచేసుకోవద్దు.

విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తత: ఎత్తైన గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తరలించేటప్పుడు రోడ్లపై ఉండే విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. విగ్రహాల రవాణా సమయంలో మరియు నిమజ్జన వేదికల వద్ద పోలీసు మరియు విద్యుత్ అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలి.

ఎల్ నినో ప్రభావం..నీటి వనరుల సంరక్షణ: ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల నీటి వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల నిమజ్జనాల పేరుతో చెరువులు, నదులు మరియు ఇతర నీటి వనరులను కాలుష్యం చేయవద్దు. ప్రకృతిని కాపాడుకుంటూ భక్తితో వేడుకలు జరుపుకుందాం.

శోభయాత్ర లో పాల్గొనే భక్తులు పాటించ వలసిన నిబంధనలు

👉 శోభయాత్ర వాహనాలు ఒక క్రమపద్ధతిలో, వరస క్రమంలో వెళ్ళాలి.
👉 గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీలు నిమర్జనం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా చెరువులు, కుంటల లలో నిమర్జనం చేసుకోవడం మంచిది. ప్రమాదాలకు దూరంగా ఉండాలి.
👉 ఎత్తైన విగ్రహాల తీసుకెళ్లే వారు మార్గం మధ్యంలో విద్యుత్ తీగలు గమనించాలి.
👉 గణపతి విగ్రహాల్ని తీసికొని వెళ్ళే వాహానాలను మంచి స్థితిలో ఉండాలి. డ్రైవర్ అనుభవం కలిగి ఉండాలి .
👉 మద్యం త్రాగి వాహనాలను నడుపరాదు.
👉 టపాకాయలు కాల్చరాదు .
👉గణేష్ శోభాయాత్రలోని వాహనాలు రోడ్డుకు ఒకవైపు వరుసగా ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి.
👉ట్రాఫిక్ నకు అంతరాయం కలిగించే విధంగా రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలిపరాదు.
👉డీజే లకు అనుమతి లేదు. సాంప్రదాయ శబ్దాలతో ఉత్సవం జరుపుకోవాలి. ఎవరైనా డీజేలను వాడితే పోలీసువారు అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని డీజేలను సీజ్ చేయడం జరుగుతుంది.
👉 వాహనాలపై పిల్లలు ఉండవద్దు, కరెంట్ తీగలు గమనించాలి, పుకార్లు నమ్మవద్దు, స్కూల్స్, ప్రార్థన మందిరాలు, హాస్పిటల్స్ వద్ద పెద్ద శబ్దాలు చేయవద్దు.
👉 అత్యవసర సమయంలో 112 కు ఫోన్ చేసి పోలీస్ సహాయం పొందాలి.
👉 వినాయక విగ్రహాలను తరలించే వాహనాలను నడిపే డ్రైవర్లు మద్యం సేవించి నడిపితే వారిపై కఠిన చర్యలు
👉మద్యం సేవించి వాహనాలను నడిపే వాహనదారులపై చర్యల కొరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం జరుగుతుంది.
👉ఊరేగింపుగా వెళ్లు సమయాల్లో విద్యుత్ షాక్ లకు గురవకుండా అప్రమత్తంగా ఉండాలి.
👉చెరువులు,నదుల వద్ద విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.

ప్రతిఒక్కరూ పోలీసులకు సహకరించాలి.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.