Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జిల్లా పోలీస్ సిబ్బందికి రెయిన్ కోట్స్ అందించిన జిల్లా ఎస్పీ నరసింహా

Author
Posted By Telangana Vaartha
| 21 Sep 2026, 08:20 PM | హైదరాబాద్
జిల్లా పోలీస్ సిబ్బందికి రెయిన్ కోట్స్ అందించిన జిల్లా ఎస్పీ నరసింహా

వర్షాకాలంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సౌకర్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పోలీస్ శాఖ నుండి సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు కేటాయించిన రెయిన్ కోట్స్‌ను జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్ గారు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ పోలీస్ సిబ్బందికి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహా ఐపీఎస్ గారు మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా పోలీస్ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు తమ సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ సూచించారు. ప్రజల సమస్యలకు స్పందిస్తూ, వారి భద్రతకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, భద్రతతో పాటు విధి నిర్వహణకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు జిల్లా పోలీస్ శాఖ తరఫున తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పోలీస్ సంఘం అధ్యక్షుడు రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్ మరియు ఏఆర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ సిబ్బందికి రెయిన్ కోట్స్ అందించిన జిల్లా ఎస్పీ నరసింహా - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.