జిల్లా పోలీస్ సిబ్బందికి రెయిన్ కోట్స్ అందించిన జిల్లా ఎస్పీ నరసింహా
వర్షాకాలంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సౌకర్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పోలీస్ శాఖ నుండి సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు కేటాయించిన రెయిన్ కోట్స్‌ను జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్ గారు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ పోలీస్ సిబ్బందికి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహా ఐపీఎస్ గారు మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా పోలీస్ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు తమ సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. ప్రజల...