Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గుప్త నిధుల కొరకు అక్రమ తవ్వకాల కోసం ప్రయత్నం

Author
Posted By Telangana Vaartha
| 21 Sep 2026, 07:43 PM | హైదరాబాద్
గుప్త నిధుల కొరకు అక్రమ తవ్వకాల కోసం ప్రయత్నం

ముఖ్యమైన పాయింట్స్:

  • –12 మంది అరెస్ట్ మరో వ్యక్తి పరారీ.

పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాజిపురంలో ఒక పురాతన మరియు చారిత్రాత్మక దర్గా (మసీదు) లో 16.09.2026న రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు ఆ దర్గాలో దాగి ఉన్న గుప్త నిధి కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు గమనించి నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేస్తున్న కొంత మందిని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పెన్పహాడ్ పోలీస్ వారు వెళ్ళి 16.09.2026న రాత్రి సుమారు 10:30 గంటలకు పురాతన మరియు చారిత్రక దర్గా వద్ద AP-16-DR-5256 నంబర్ గల కారు మరియు బైక్‌లలో వచ్చిన కొందరు వ్యక్తులు దర్గా ఆవరణలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించి, అక్కడ తవ్వకాలు జరుపుతూ దర్గాకు నష్టం కలిగిస్తున్న మరియు అనుమానాస్పదంగా తవ్వకాలు చేస్తున్న వ్యక్తులను గుర్తించి 10 మందిని పోలీస్ స్టేషన్ కు తరలించగ మరో ముగ్గురు పరారీ లో ఉన్నారు. ఈ ఘటనపై అనంతారం గ్రామంలో GPO గా పనిచేస్తున్న పెరుమళ్ల పిచ్చమ్మ ఫిర్యాదు మేరకు పెనవహాడ్ SI N బాలు నాయక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సూర్యాపేట రూరల్ CI G. రాజశేఖర్ గారి ఆద్వర్యంలో పెనవహాడ్ SI N బాలు నాయక్ 12 మంది నిందితులను అదుపులోకి తీసుకుని ఈ రోజు అరెస్ట్ చేయటం జరిగినది ,మరో వ్యక్తి పరారీ లో ఉన్నారు అని తెలిపినారు .
నిందితుల వివరాలు
1. దొంగరి మధన్ (తండ్రి: గోపయ్య, నివాసం: దోసపహాడ్ గ్రామం),
2. షేక్ సైదా (తండ్రి: మదర్ సాబ్, నివాసం: దోసపహాడ్ గ్రామం),
3. సయ్యద్. అమీర్ అలీ S/o మల్సూర్ R/o కాసరాబాద్ గ్రామం,
4.షేక్ రహమాన్ రఫీ S/o ఇబ్రహీం, R/o బీమవరం గ్రామం, నందిగామ మండలం,
5. షేక్ అహమ్మద్ S/o బషీర్ R/o నందిగామ గ్రామం,
6. షేక్ మహ్మద్ రఫీ r /o మాగుళ్ళు గ్రామం. నందిగామ
7. మైనుద్దీన్ S/o ఇబ్రహీం, R/o నందిగామ గ్రామం,
8. మహ్మద్ సుల్తానా మియా S/o అబ్దుల్ హకీం R/o బోరువా గ్రామం, నారాయణపూర్ PS, జార్ఖండ్ రాష్ట్రం,
9. మహమ్మద యాసిర్ S/o సిరాజ్ అన్సారీ, R/o కెందువతద్ గ్రామం, నారాయణపూర్ మా/సలాలా PS, జార్ఖండ్ రాష్ట్రము
10. పి. మీనయ్య రాజీవ్ నగర్, దురాజ్‌పల్లి గ్రామం,
11. సయ్యద్ అక్బర్ S/o యాకూబ్ R/o దోసపహాడ్ గ్రామం,
12. రూపాని వెంకన్న దూరాజ్ పల్లి గ్రామం
13. కొమరరాజు నర్సింహ R/o కాసరబాద్ గ్రామం, పరారీ లో ఉన్నాడు
స్వాదీన పరుచుకున్న వివరాలు
1. 1 కార్
2. 2 బైక్ లు 1 స్కూటీ ,
3. 2 పారలు 2 టెంకలు
4. 12 సెల్ ఫోన్ లు
ప్రజలు గుప్త నిధుల పేరుతో జరిగే మోసాలను నమ్మవద్దని, ఇలాంటి కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.