Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

చెమట చుక్కే మా ఊపిరి... మా శ్రమే ఈ ఆసుపత్రికి జీవం! అనే పాట ఆవిష్కరణ

Author
Posted By Telangana Vaartha
| 21 Sep 2026, 07:35 PM | తాజా సమాచారం
చెమట చుక్కే మా ఊపిరి... మా శ్రమే ఈ ఆసుపత్రికి జీవం! అనే పాట ఆవిష్కరణ

ఖమ్మం : వేలాది మంది హృదయాలను మేల్కొలిపి , కార్మిక లోకానికి ఆత్మస్థైర్యాన్ని నింపే ఒక శక్తివంతమైన పాటను ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య , నరేష్ ల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది . ఈ సందర్భంగా చిన్న బోస్కో , పత్తిపాటి శ్రీనివాస రావు , శానిటేషన్ , పేషెంట్ కేర్ మరియు సెక్యూరిటీ ల భవిష్యత్తు కొరకు ఒక మంచి సాంగ్స్ ని విడుదల చేసినారు . ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ ముందుండి నడిపించారు . అహర్నిశలు ఆసుపత్రి సేవల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి , సమాజ ఆరోగ్య రక్షణ కోసం శ్రమిస్తున్న శానిటేషన్ , పేషెంట్ కేర్ మరియు సెక్యూరిటీ సిబ్బంది హక్కుల సాధనకై , వారి భవిష్యత్తుకు వెలుగు బాటలు పరిచేందుకు రూపుదిద్దుకున్న ఉద్యమ గీత అని అన్నారు . ఈ పాట కేవలం కొన్ని పదాల సమూహం కాదు... అణచివేతకు గురవుతున్న ప్రతి కార్మికుడి గుండె చప్పుడు! కష్టజీవుల చెమట చుక్కకు లభించాల్సిన గౌరవాన్ని, వారి న్యాయమైన హక్కులను ప్రశ్నించే ఒక బులెట్ లాంటి గళం. కార్మిక లోకంలో చైతన్య రగిల్చే ఈ విప్లవ గీతావిష్కరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు . కార్మికుల సమస్యల పట్ల కార్మికుల యొక్క పోరాట స్ఫూర్తిని నింపుతూ అద్భుతమైన రీతిగా పాటను రచించినటువంటి మద్దెల మధు ని రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు వివిధ జిల్లాల నాయకులు అభినందించారు . ఈ కార్యక్రమంలో ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ ప్రచార కార్యదర్శి ఏ. ప్రసాద్ , రాష్ట్ర కమిటీ సభ్యులు చాగంటి నాగమణి , ఎస్ పి ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బత్తుల మమత , ఖమ్మం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కర్ష జగదీష్ , ఖమ్మం జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు రాయల రమ్య , గుగ్గిళ్ళ నాగేంద్ర , గుగ్గులోతు శ్యాము , భూక్య సోనీ , ఖమ్మం జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి గద్దల కళ్యాణి , ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు బి. సత్యవతి , పి.ప్రశాంతి , సిహెచ్.అనిల్ , గార్డెన్ నాగరాజు , ఆర్.ఉమా , జే.జ్యోతి , బి.వెంకటేష్ , గార్డెన్ సీతారాములు , ఎస్.కె. రేష్మ , డి.మంగమ్మ , గార్డెన్ శ్రీనివాస్ , యం.రమాదేవి , ఎస్.సుజాత , బి.కరుణమ్మ , గార్డెన్ వెంకన్న , రామకృష్ణ , ఎల్లయ్య , ఎస్.కె. భాష , సూర్యాపేట జిల్లా ఎస్ పి ఎస్ కమిటీ అధ్యక్షులు నాగభూషణం తదితర కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

చెమట చుక్కే మా ఊపిరి... మా శ్రమే ఈ ఆసుపత్రికి జీవం! అనే పాట ఆవిష్కరణ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.