Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

బాలలందరు సురక్షితంగా ఉండాలి

Author
Posted By Telangana Vaartha
| 21 Sep 2026, 07:23 PM | మహబూబ్నగర్
బాలలందరు సురక్షితంగా ఉండాలి

జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. చిన్నిపాడు గ్రామము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఆధ్వర్యంలో బాలల హక్కులు మరియు రక్షణ చట్టాల పట్ల అవగాహనా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీవో నరసింహ మాట్లాడుతూ బాలలందరు స్వేచ్ఛయుత వాతావరణంలో పెరగాలి ఎందుకు బాలలకు హక్కులు ఉన్నాయి. బాలల హక్కులకు ఎవరైనా భంగం కల్పించినటలయితే చట్టం ప్రకారం శిక్షర్హులు అవుతారు. మీరందరు కూడా బాలలుగా మీ యొక్క బాధ్యత చదువుకోవడం. దానిని అందరు పూర్తిగా నిర్వర్తించాలి. ఎక్కడ కూడా చెడు వ్యాసనాలకు బానిస అవ్వకూడదు. నేటి యువత మత్తుపదార్థాల వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని పిల్లలకు వీడియోల ద్వారా అవగాహనా కల్పించారు. అలాగే బాలల సంక్షేమం కోసం చైల్డ్ హెల్ప్ లైన్ 1098 అను టోల్ ఫ్రీ నెంబర్ దేశవ్యాప్తంగా పనిచేస్తుందని, 24 గంటలు సేవలు అందించే ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ అని అన్నారు. ప్రతిఒక్కరు ఆడపిల్లల పట్ల సోదరభావంతో ఉండాలని అన్నారు. బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 గురించి వివరిస్తూ ఈ చ ట్టం బాలలకు రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. బాలల సమస్యల పరిష్కా రం కోసం డయల్‌ 100, 1098కి ఫోన్‌ చేయాలని సూచించారు. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం 18 సంవత్సరాలు నిండని అమ్మాయికి 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి వివాహం జరిపించకూడదు. ఈ చట్టం గ్రామ స్థాయి నుంచి జిల్లాలో స్థాయి వరకు కూడా బాల్య వివాహ నిరోధక అధికారులను నియమించి బాల్య వివాహలను నిర్ములిస్తున్నది. 18 సంవత్సరాలు నిండని పిల్లలలో ఎదుగుదల ఉండదు ఆలోచించే విధానం తక్కువగా ఉంటుంది. ఒక బాల్య వివాహం జరిపిస్తే లక్ష రూపాయల జరిమానా లేదా రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది కాబట్టి చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయడం నేరమని, అలాంటి సమాచారం తమకు అందించాలని కోరారు. మొబైల్ ఫోన్ వినోయోగం ద్వారా చాలా ప్రమాదాలు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. కాబట్టి అందరు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలన్నారు. బాల కార్మికులు గా ఎవరైనా పనిచేస్తున్న కూడా ఆ పిల్లలను రిస్క్యూ చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడం జరుగుతుందన్నారు. బాల కార్మిక నిషేధ చట్ట ప్రకారం పనిలో ఉంచుకున్న యజమాని మరియు తల్లిదండ్రులపై కేసు నమోదు గురించి వివరించారు. మహిళా రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ 181 అందుబాటులో ఉన్నాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ శివలీల, సఖి సెంటర్ CA అరుణ, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.