Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కేబుల్ టీవీ జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వాలి

Author
Posted By Telangana Vaartha
| 20 Sep 2026, 02:50 AM | హైదరాబాద్
కేబుల్ టీవీ జర్నలిస్టులకు అక్రిడేషన్  ఇవ్వాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • సిపిఐ ఫ్లోర్ లీడర్ కూణంనేని సాంబశివరావు డిమాండ్

బషీర్బాగ్ / హైదరాబాద్ అనుణిత్యం ప్రజల కొరకు పాటుపడుతూ ప్రసారాలు కొనసాగిస్తున్న కేబుల్ టీవీ విలేకరులకు అందరికీ ప్రతి మండలానికి అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని సిపిఐ శాసనసభ పక్ష నాయకులు కూణం నేని సాంబశివరావు ప్రభుత్వ ని డిమాండ్ చేశారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కేబుల్ టీవీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం గతంలో ప్రతి జిల్లాకు నలుగురికి అక్కడేషన్లు ఇచ్చిన సందర్భ ని పురస్కరించుకొని ఈ ప్రభుత్వం కూడా ప్రతి నియోజకవర్గంలో రిపోర్టర్ కి కెమెరామెన్ కి వార్తల సేకరణకు అక్రిడేషన్ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి నరసింహ చారి అధ్యక్షులు జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవసరమనుకుంటే మీ సమస్యను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యకు పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరహత హాలి సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నం చిన్ని వెంకటేశ్వరరావు అసోసియేషన్ ఉపాధ్యక్షులు పొదిల వెంకట్ కుమారస్వామి అమర్ మహేష్ ఉపాధ్యాయ నాయన శ్రీనివాసరావు s9 రవి శ్రీరాములు సుభాష్ గౌడ్ ప్రతాప్ శ్రీనివాసరావు ఆశిక్ పాషా విజయ్ రెడ్డి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.