Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గ్రామ కమిటీల నిర్మాణం, సభ్యత్వ క్యాంపెయిన్‌ను జయప్రదం చేయాలి

Author
Posted By Telangana Vaartha
| 20 Sep 2026, 02:31 AM | హైదరాబాద్
గ్రామ కమిటీల నిర్మాణం, సభ్యత్వ క్యాంపెయిన్‌ను జయప్రదం చేయాలి

భువనగిరి 19 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్,జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఎన్ పి ఆర్ డి గ్రామ కమిటీల నిర్మాణాన్ని చేపట్టాలని, సభ్యత్వ క్యాంపెయిన్‌ను విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17 మండలాల పరిధిలో అన్ని గ్రామాల్లో పర్యటించి, వికలాంగులను సంఘటితం చేసి నూతన గ్రామ కమిటీలను ఎన్నుకోవడంతో పాటు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు కోరారు.ఎన్నికల సందర్భంగా వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల పెన్షన్‌ను రూ.6వేలకు పెంచుతామని ఇచ్చిన హామీ అమలు కాకుండా మూడు సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వికలాంగుల పెన్షన్‌ను రూ.6వేలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వికలాంగ నిరుద్యోగులకు సంబంధించిన బ్యాక్‌లాగ్ పోస్టులను (వికలాంగుల కోసం రిజర్వ్ చేయబడిన ఖాళీ పోస్టులు) వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను మరింత విస్తృతం చేస్తామని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంఘాన్ని బలోపేతం చేసి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని సురుపంగ ప్రకాష్, వనం ఉపేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా కోశాధికారి కొత్త లలిత జిల్లా కమిటీ సభ్యులు పండాల శ్రీహరి జిల్లా కమిటీ సభ్యులు ఎం రాములు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.