గ్రామ కమిటీల నిర్మాణం, సభ్యత్వ క్యాంపెయిన్‌ను జయప్రదం చేయాలి

భువనగిరి 19 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్,జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఎన్ పి ఆర్ డి గ్రామ కమిటీల నిర్మాణాన్ని చేపట్టాలని, సభ్యత్వ క్యాంపెయిన్‌ను విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17 మండలాల పరిధిలో అన్ని గ్రామాల్లో పర్యటించి, వికలాంగులను సంఘటితం చేసి నూతన గ్రామ కమిటీలను ఎన్నుకోవడంతో పాటు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు కోరారు.ఎన్నికల సందర్భంగా వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే...