Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

Author
Posted By Telangana Vaartha
| 20 Sep 2026, 01:42 AM | ములుగు
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

ముఖ్యమైన పాయింట్స్:

  • ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత

ములుగు జిల్లా, సెప్టెంబర్ :19 ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలాలలో మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ముగించుకునే కార్యక్రమంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లల్లో ప్రజలకు ఏ హాని భక్తులకు ఏ హాని కాకుండా నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు కోసం ఏటూరు నాగారం ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏటూరునాగారం సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ రాబోయే 23వ తేదీన జరగబోయే వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.నిమజ్జన ఉత్సవాలకు గ్రామ పంచాయతీ తరఫున అన్ని విధాలా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.భక్తులకు మండపాల నిర్వాహకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిమజ్జన మార్గాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు వీధి దీపాల (లైటింగ్) ఏర్పాటు అవసరమైన ఇతర మౌలిక వసతులను గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా ముమ్మరంగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.పోలీస్ శాఖ ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేలా చూస్తామని సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజలు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులకు అధికారులకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో స్థాయి మండల అధికారులు పోలీస్ అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.