Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

హమారా ప్రసాద్ అరెస్టు సేసిన రాష్ట్ర పోలీసులకు కృతజ్ఞతలు

Author
Posted By Telangana Vaartha
| 20 Sep 2026, 01:38 AM | వరంగల్
హమారా ప్రసాద్ అరెస్టు సేసిన రాష్ట్ర పోలీసులకు కృతజ్ఞతలు

ములుగు జిల్లా, సెప్టెంబర్ :19 అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో హమారా ప్రసాద్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి కుల సంఘాల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ విజిలెన్స్ కమిటీ సభ్యులు భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ జన్ను రవి అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకుడు చంటి భద్రయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవాన్ని కల్పించిందని రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అంబేద్కర్‌ను అవమానించడం అంటే రాజ్యాంగ విలువలను అవమానించడమే. సామాజిక న్యాయం సమానత్వం కోసం అంబేద్కర్ ఆశయాల సాధనకు నిరంతరం పోరాడుతాం అని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి కోకన్వీనర్ నద్దునూరి రమేష్ అంబేద్కర్ ఈస్ట్ చంటి భద్రయ్య ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నెమలి నరసయ్య మాదిగ చిందువక్కల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు జిల్లా ఎమ్మార్పీఎస్ ములుగు మండల ఇన్చార్జి కాడపాక శ్యామ్ మాదిగ ఎస్సీ సెల్ ములుగు జిల్లా అధ్యక్షులు మట్టెవాడ తిరుపతి కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రతినిధి బొమ్మ కంటి రమేష్ వర్మ ఇనుముల సుధాకర్ ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు లాదెళ్ల అశోక్ బోడ రాములు మాదిగ సిపిఐ పార్టీ కార్యదర్శి జంపాల రవీందర్ సిపిఐ మండల కార్యదర్శి ముత్యాల రాజు దళిత నాయకుడు రత్నం దామోదర్ కుర్రి దినాకర్ గడ్డమీది దేవేందర్ తంగేళ్ల మల్లన్న బోయిని సదయ్య తాళ్లపేల్లి సాంబయ్య బూత్కూరి రవి తదితరులు పాల్గొన్నారు.

హమారా ప్రసాద్ అరెస్టు సేసిన రాష్ట్ర పోలీసులకు కృతజ్ఞతలు - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.